హైదరాబాద్: 28°C
తెలంగాణ

యువతకు ఉచిత వృత్తి శిక్షణ

BDK: సింగరేణి కొత్తగూడెం ఏరియా సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత వృత్తి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు మంగళవారం ఏరియా GM సిహెచ్.వెంకటరమణ తెలిపారు. మగ్గం వర్క్, టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటిషన్ వర్క్, జ్యూట్ బ్యాగుల తయారీలో శిక్షణ ఉంటుందన్నారు. అక్టోబర్ 1వ తేదీ సాయంత్రం 4 గంటల్లోపు కొత్తగూడెం ఏరియా పర్సనల్ డిపార్ట్‌మెంట్‌లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.