హైదరాబాద్: 28°C
తెలంగాణ

33 పేజీల లేఖ వైరల్.. రైస్ మిల్లర్ సంచలన ఆరోపణలు

NLG: ప్రజాప్రతినిధులు, అధికారులు, మధ్యవర్తుల వేధింపులతో తాను ఆర్థికంగా నష్టపోయానని ఆరోపిస్తూ నల్గొండ జిల్లాకు చెందిన ఓ రైస్ మిల్లర్ రాసిన 33 పేజీల లేఖ వైరల్‌గా మారింది. తన నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారని, ఎవరికి ఎంత చెల్లించారనే వివరాలను పేర్లతో సహా లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. చివర్లో ‘అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు’ అంటూ రాసినట్లు తెలుస్తోంది.