హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్‌

SRPT: ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకే ప్రజా దర్బార్‌ నిర్వహిస్తున్నామని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. కోదాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని సూచించారు