హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రంగా విగ్రహావిష్కరణకు అన్ని వర్గాలు రావాలి: నిమ్మల

W.G: అక్టోబర్ 1న ఉండ్రాజవరంలో నిర్వహించనున్న వంగవీటి మోహనరంగా విగ్రహ ప్రతిష్ఠ, ఆవిష్కరణ కార్యక్రమానికి అన్ని వర్గాల పెద్దలు హాజరుకావాలని మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు. సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గ్రామ పెద్దలు నిర్ణయించారని తెలిపారు. మంత్రి కందుల దుర్గేష్ సారథ్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు.