కృష్ణా: తమ సమస్యల పరిష్కారం కోరుతూ పెడనలో వీఆర్ఏలు చేపట్టిన సమ్మె మంగళవారం తొమ్మిదో రోజుకు చేరుకుంది. సమ్మె శిబిరం వద్ద వీఆర్ఏలు వంటావార్పు కార్యక్రమం నిర్వహించి నిరసన తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పెడనలో వీఆర్ఏల వంటావార్పు


