హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ ఆసుపత్రిలో సేవా సంకల్ప్‌ శిబిరం

NTR: విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం నిర్వహించిన సేవా సంకల్ప్ శిబిరంలో మెంటల్ హెల్త్ టీమ్ 'టెలి-మానస్ స్టాల్'ను మానసిక వైద్యులు ఏర్పాటు చేశారు. మానసిక ఆరోగ్య సేవలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు ఎదురైనప్పుడు 14416 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి నిపుణుల ఉచిత సలహాలు పొందవచ్చని వైద్యులు తెలిపారు.