హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోగుల ఆహారంలో గోల్‌మాల్‌పై విచారణ చేపట్టాలి: రమణరాజు

కాకినాడ GGHలో రోగుల డైట్ పేరిట దోపిడీ జరుగుతోందని పౌర సంక్షేమ సంఘం ఆరోపించింది. పేద రోగులకు అందించాల్సిన పౌష్టికాహారాన్ని కాజేస్తున్నారని సంఘ కన్వీనర్ రమణరాజు మండిపడ్డారు. వైద్యులు, డైటీషియన్లు రోగి ఆరోగ్యాన్ని బట్టి సిఫార్సు చేసిన మెనూ ప్రకారం ఆహారం ఇవ్వడం లేదని, దీనిపై కలెక్టర్ తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.