నెల్లూరు: అల్లూరు మండలం కొండాయపాలెం అంగన్వాడీలో మంగళవారం పౌష్టికాహారంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూపర్‌వైజర్ సౌజన్య హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ.. పరిశుభ్రమైన ఆహారాన్ని తినాలని సూచించారు. అదేవిధంగా ఇంటా బయట పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అన్నం తినే ముందు కచ్చితంగా చేతులు కడుక్కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పరిశుభ్రమైన ఆహారాన్ని తినండి: సూపర్‌వైజర్


