హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏలూరులో పోలీసులకు CPRపై అవగాహన

ELR: వరల్డ్ హార్ట్ డే సందర్భంగా జిల్లా పోలీసులకు CPR (కార్డియో పల్మనరీ రిససిటేషన్)పై అవగాహన కార్యక్రమాన్ని ఏలూరు ఆశ్రమ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అత్యవసర సమయంలో గుండెపోటుకు గురైన వారికి తక్షణ ప్రథమ చికిత్స అందించే విధానంపై పోలీసులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ తమ్మిరాజు, డాక్టర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.