NLG: దేవరకొండ మండలం మైనంపల్లి గ్రామంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం ‘పోషణ పక్షం’ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ రాంసింగ్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పౌష్టికాహారం తీసుకోవాల్సిన విధానంపై అవగాహన కల్పించారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.
తెలంగాణ
మైనంపల్లిలో పోషణ పక్షం కార్యక్రమం


