BPT: ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా ఉప్పుటూరు పంచాయతీ వద్ద హోమియో వైద్యులు డాక్టర్ దాసరి చంద్రశేఖర్ అవగాహన సదస్సు నిర్వహించారు. జీవనశైలి మార్పులతో యువతలో గుండె జబ్బులు పెరుగుతున్నాయని, రోజూ 45 నిమిషాల నడక, పౌష్టికాహారం అవసరమని చెప్పారు. ధూమపానం వీడి, యోగా చేయాలన్నారు. 30 ఏళ్లు దాటిన వారు ఏడాదికి ఒకసారి గుండె పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
గుండె జబ్బులపై అవగాహన సదస్సు


