హైదరాబాద్: 28°C
వార్తలు

సిరిసిల్లలో KTRకు సినిమా చూపిస్తాం: చామల

TG: మాజీమంత్రి KTRకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రేపు సిరిసిల్లలో కేటీఆర్‌కు సినిమా చూపించబోతున్నామని తెలిపారు. ప్రజల ముందు కేటీఆర్ బాగోతం సీఎం బయటపెడతారని వ్యాఖ్యానించారు. సిరిసిల్లలో కేటీఆర్ పనులన్నీ శంకుస్థాపనలకే పరిమితం అయ్యాయని చెప్పారు. మెట్రో, మూసీ, RRR, బుల్లెట్ రావొద్దని కేటీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.