హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 20 నెలలుగా జీతాలు లేవు.. స్వీపర్ల ఆందోళన

HYD: తెలంగాణ సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛాంబర్ వద్ద స్వీపర్లు ఆందోళనకు దిగారు. గత 20 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో తమకు నెలకు రూ.5,200 జీతం వచ్చేదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు చేయించుకుంటున్నప్పటికీ వేతనాలు ఇవ్వడం లేదని ఓ మహిళా స్వీపర్ వాపోయారు.