MNCL: ప్రజలు విధిగా పరిసరాల పరిశుభ్రత పాటించాలని లక్షెట్టిపేట మండల ఎంపీడీవో మధుసూదన్ సూచించారు. మంగళవారం ఆయన మండలంలోని గుల్లకోట గ్రామంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను తనిఖీ చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో నిర్వహించిన 'స్వచ్ఛతాహీ సేవా' కార్యక్రమంలో పాల్గొని శ్రమదానం చేశారు.
తెలంగాణ
ప్రతి ఒక్కరు పరిశుభ్రత పాటించాలి: ఎంపీడీవో


