హైదరాబాద్: 28°C
వార్తలు

నితిన్ నబీన్ అధ్యక్షతన ఇంఛార్జుల సమావేశం

ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో రాష్ట్రాల బీజేపీ నూతన ఇంఛార్జులు, కో-ఇంఛార్జులు పాల్గొన్నారు. సంస్థాగత ప్రక్షాళనే ప్రధాన అజెండాగా ఇంఛార్జులు, కో-ఇంఛార్జులతో నితిన్ మాట్లాడనున్నారు. అలాగే వచ్చే ఏడాది జరిగే యూపీ, పంజాబ్, గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలపై కూడా చర్చించనున్నారు.