హైదరాబాద్: 28°C
వార్తలు

ఇండియా కూటమిపై బీజేపీ మండిపాటు

ఇండియా కూటమిపై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. దేశంలో అరాచకం, అయోమయం సృష్టించడానికి ఇండియా కూటమి కుట్ర పన్నుతోందని మండిపడింది. కల్పిత కథనం ఆధారంగా దేశంలో గందరగోళం సృష్టించడానికి యత్నిస్తుందని ధ్వజమెత్తింది. దేశాభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతి ఉదయం కుట్ర చేసే టూల్‌కిట్‌ మనస్తత్వానికి ఇది ఉదాహరణ అని దుయ్యబట్టింది.