హైదరాబాద్: 28°C
వార్తలు

దేశంలో బొగ్గు కొరత లేదు: కేంద్రమంత్రి

విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత ఏర్పడిందనే వార్తలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. వర్షాభావం వల్ల జల విద్యుదుత్పత్తి తగ్గడంతో థర్మల్ విద్యుత్తుకు డిమాండ్ 12-15 శాతం పెరిగిందని.. అదే టైంలో వర్షాకాలం బొగ్గు తవ్వకాలను ప్రభావితం చేసిందన్నారు. ఈ అంతరాయాలను బొగ్గు కొరతగా భావించొద్దని తెలిపారు. బొగ్గు కొరత ఎక్కడా లేదని.. రైలు, రోడ్డు మార్గాలలో సరఫరా చేస్తున్నట్లు చెప్పారు.