ఉజ్జయినిలో(మధ్యప్రదేశ్) షాహీ మసీదును కూల్చివేస్తున్నట్లు సృష్టించిన ఫేక్ 'ఏఐ' వీడియోలే తాజా అల్లర్లకు కారణమని పోలీసులు తేల్చారు. రోడ్డు విస్తరణ కోసం మసీదులో కొంత భాగాన్నే తొలగిస్తుండగా, ఫేక్ వీడియోలతో జనం రెచ్చిపోయి పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఐదుగురు కంటెంట్ క్రియేటర్లు సహా 20 మందిపై 8 FIRలు నమోదయ్యాయి. 100కు పైగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలపై పోలీసులు నిఘా పెట్టారు.
వార్తలు
అల్లర్లు.. ఫేక్ 'ఏఐ' వీడియోలే కారణం


