MHBD: డోర్నకల్ మండలం గొల్లచర్ల గ్రామ శివారులోని చెరువు కట్టపై మంగళవారం ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. లింబ్యతండాకు చెందిన భూక్యా శాంతిగా స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. మహిళ మృతి అనుమానాస్పదంగా ఉండటంతో కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి


