హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు జిల్లాకు రానున్న బీజేపీ చీఫ్

NLG: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనరసయ్య బుధవారం నల్గొండ జిల్లాలో పర్యటించనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి తెలిపారు. మేళ్లదుప్పలపల్లి, తొరగల్, చిన్న మాదారం గ్రామాల్లో పర్యటించి ఎండిన పంట పొలాలను పరిశీలించడంతో పాటు రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారని పేర్కొన్నారు.