హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయాల్లో చోరీ.. నగదు, ఆభరణాలు అపహరణ

SRCL: నూకలమర్రి ఎల్లమ్మ, పెద్దమ్మ, బాలరాజుపల్లి పెద్దమ్మ ఆలయాల్లో ఆదివారం అర్ధరాత్రి దుండగులు తాళాలు పగలగొట్టి నగదు, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. వేములవాడ రూరల్ ఎస్సై ప్రశాంత్‌రెడ్డి సోమవారం ఘటనా స్థలాలను పరిశీలించి ఆధారాలు సేకరించారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆలయాల్లో విలువైన వస్తువులు ఉంచవద్దని తెలిపారు.