హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిడ్‌మానేరు రిజర్వాయర్‌లో 23.90 టీఎంసీల నీటి నిల్వ

SRCL: బోయినపల్లి మండలం మాన్వాడలోని మిడ్‌మానేరు రిజర్వాయర్‌లో నీటిమట్టం +316.54 మీటర్లకు చేరింది. 27.55 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గాను 23.909 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 24 గంటల్లో సగటున 1,536 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. 6,482 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉండగా, రివర్ గేట్ల ద్వారా 3,986, ప్యాకేజీ-10 ద్వారా 2,326 క్యూసెక్కులు విడుదలవుతున్నాయి.