ADB: ఇంద్రవెల్లిలోని సమాక గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అ ఘటనలో ఒకరు మృతి చెందారు. స్థానికల వివరాల ప్రకారం.. సమాక గ్రామ సమీపంలోని జిన్నింగ్ మిల్ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తుమ్మగూడకి చెందిన జంగుకు తీవ్ర గాయాలు కావడంతో రిమ్స్‌కు తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురికి చికిత్స పొందుతున్నట్లు 108 సిబ్బంది తెలిపారు.
తెలంగాణ
రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతి


