HYD: ఫిలింనగర్‌లోని శిరీష హోటల్లో రూ.10 బిల్లు వివాదం దాడికి దారితీసింది. పద్మాలయ అంబేద్కర్ నగర్ బస్తీకి చెందిన యువకులు టిఫిన్ చేశాక రూ.110 బిల్లుకు గాను రూ.100 మాత్రమే ఇచ్చారు. మిగతా డబ్బులు అడిగిన హోటల్ యజమాని నారాయణ, ఆయన కుమారుడు యతీశ్‌పై శివ, రవి, భీమయ్య, వెంకటేష్, పవన్, అరుణ్ తదితరులు వాగ్వాదానికి దిగి దాడి చేశారు.
తెలంగాణ
రూ.10 విషయంలో హోటల్ యజమానిపై దాడి


