హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆయిల్ పామ్ పంటను సందర్శించిన కలెక్టర్

MDK: కౌడిపల్లి మండలంలోని ముత్రజ్‌పల్లి గ్రామంలో రైతు శ్రీనివాస్ సాగు చేస్తున్న ఆయిల్ పామ్ తోటను కలెక్టర్ సందర్శించారు. ఎన్‌ఎంఈఓ-ఓపీ పథకం కింద తోటలో పరాగసంపర్క కీటకాలను (ఎలీడోబియస్ కెమరూనికస్) ఉద్యానవన, వ్యవసాయ అధికారులతో (డీహెచ్‌ఎస్‌ఓ, డీఏఓ) కలిసి కలెక్టర్ విడుదల చేశారు. ఆయిల్ పామ్ పంట దిగుబడి పెంపునకు ఇది ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు.