హైదరాబాద్: 28°C
తెలంగాణ

శిథిలావస్థలో తాగునీటి ట్యాంకు.. స్థానికుల్లో ఆందోళన!

VKB: తాండూరు మండలం మల్కాపూర్‌లో 40 ఏళ్ల క్రితం నిర్మించిన తాగునీటి ట్యాంకు శిథిలావస్థకు చేరింది. పెచ్చులూడిపడటంతో ఇనుప చువ్వలు బయటకు కనిపిస్తున్నాయి. ట్యాంకు కూలితే సమీప ఇళ్లపై పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, త్వరలో ట్యాంకును కూల్చివేస్తామని తెలిపారు.