హైదరాబాద్: 28°C
తెలంగాణ

సిద్దిపేటలో ఇండస్ట్రీస్ కమిటీ భేటీ

SDPT: కొత్త పరిశ్రమల ఏర్పాటుతో స్థానికులకు పెద్దపీట వేస్తూ ఉపాధి కల్పించాలని కలెక్టర్ కె. హైమావతి స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో జిల్లా ఇండస్ట్రీస్ ప్రమోషన్ కమిటీ సమావే‌శానికి ఆమె అధ్యక్షత వహించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యమివ్వాలని, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పక్కా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.