హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పచ్చిమిర్చి లారీ బోల్తా

KMR: పచ్చిమిర్చి లోడ్‌తో హైదరాబాద్‌కు వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తాపడింది. జాతీయ రహదారి-44పై సదాశివనగర్‌ సమీపంలోని పెట్రోల్‌ బంక్‌ వద్ద మంగళవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఘటనలో డ్రైవర్‌ స్వల్ప గాయాలతో బయటపడినట్లు సమాచారం. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.