HNK: విద్యుదాఘాతంతో హన్మకొండ సుధానగర్‌కు చెందిన రుద్రారం లక్ష్మి (58) సోమవారం మృతిచెందింది. స్నానం కోసం బకెట్‌లో హీటర్ పెట్టి నీరు వేడయ్యాక తీస్తుండగా విద్యుత్ షాక్‌కు గురైంది. గమనించిన కుమార్తె యమున స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందింది. యమున ఫిర్యాదు మేరకు హనుమకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
విద్యుదాఘాతంతో మహిళ మృతి


