హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్

PDPL: ధర్మారం పట్టణానికి చెందిన మేడవేణి శ్రీనివాస్ జగిత్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం రాత్రి మండల శాఖ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పూలమాలతో ఆయనను ఘనంగా సన్మానించారు. మండలంలో పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి దేవి రాజలింగు, తదితరులు పాల్గొన్నారు.