హైదరాబాద్: 28°C
వార్తలు

2024 బ్యాచ్ IASలకు సబ్ కలెక్టర్లుగా పోస్టింగ్

AP: 2024 బ్యాచ్ IASలకు సబ్ కలెక్టర్లుగా ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ జీవో జారీ చేశారు. తెనాలికి సందీప్ రఘువంశీ, పాడేరుకు కనాల చిరంజీవి, రంపచోడవరానికి ప్రదీప్ రాజ్ కుమార్, చింతూరుకు నరేంద్ర పాడల్, పార్వతీపురానికి సచిన్ రహర్, పెనుకొండకు ఫరీన్ జహీద్, నంద్యాలకు మనీషా, రాజమండ్రికి శుభం నోఖ్వాల్ సబ్ కలెక్టర్లుగా నియమితులయ్యారు.