AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణశాఖ వెల్లడించింది. మన్యం, అనకాపల్లి, కోనసీమ, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
వార్తలు
ALERT: నేడు ఈ జిల్లాల్లో వర్షాలు


