హైదరాబాద్: 28°C
వార్తలు

ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

TG: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఈ మేరకు నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నాగర్‌కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేటలో వర్షాలు పడతాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.