హైదరాబాద్: 28°C
వార్తలు

పేకాటలో ఐదుగురి అరెస్ట్

WGL: వర్ధన్నపేట మండలం కాశగూడెం శివారులో పేకాట ఆడుతున్న ఐదుగురిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సోమవారం పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.6,980 నగదు, నాలుగు మొబైల్‌ ఫోన్లు, పేకముక్కలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిని, స్వాధీనం చేసుకున్న సొత్తును తదుపరి చర్యల కోసం మామునూర్‌ పోలీసులకు అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ ఏ. మధుసూదన్‌ తెలిపారు.