హైదరాబాద్: 28°C
వార్తలు

మయన్మార్‌ దిశగా తీవ్ర వాయుగుండం

మయన్మార్-అండమాన్ సమీపంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. మయన్మార్‌కు నైరుతి దిశగా 40 కి.మీటర్ల దూరంలో, అండమాన్‌కు ఈశాన్యంగా 610 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ముందుగా మయన్మార్ తీరాన్ని తాకి.. ఆ తర్వాత బంగ్లాదేశ్ దిశగా దూసుకెళ్తుందని పేర్కొంది. తీరం దాటే సమయంలో 50-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది.