హైదరాబాద్: 28°C
వార్తలు

భారీగా బంగారం పట్టివేత.. 11 మంది అరెస్ట్

ఢిల్లీలో బంగారం అక్రమ రవాణా ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ ఘటనలో మొత్తం 6.6 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ ముఠాకు సంబంధించిన 11 మందిని అరెస్ట్ చేశారు. పట్టుబడిన బంగారం విలువ రూ.10 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. గత 9 నెలల వ్యవధిలో విదేశాల నుంచి 318 కిలోల బంగారం రవాణా చేసినట్లు తెలిపారు.