హైదరాబాద్: 28°C
వార్తలు

పల్లె నిద్రతో ప్రజలకు చేరువైన పోలీసులు

నంద్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసు అధికారులు పల్లె నిద్ర కార్యక్రమం సోమవారం రాత్రి నిర్వహించారు. గ్రామాల్లో రాత్రి బస చేసి శాంతిభద్రతలను సమీక్షించడంతో పాటు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే 112కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.