ముంబైలో అక్టోబర్ 02న నిరసనకు అనుమతిని నిరాకరిస్తూ సీజేపీ అధినేత అభిజిత్‌కు పోలీసులు షాక్ ఇచ్చారు. శివాజీ పార్కులో భారీగా ప్రజలు గుమిగూడితే శబ్ద కాలుష్యం, ట్రాఫిక్, ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. దీనిపై అభిజిత్ స్పందిస్తూ.. ఇది పౌరుల గొంతుకను అణచివేయటమేనని తెలిపారు. ఈ మేరకు అక్టోబర్ 02న 'జైల్ భరో ఆందోళన' చేపట్టాలని పిలుపునిచ్చారు.
వార్తలు
'జైల్ భరో'కు సీజేపీ నేత అభిజీత్ పిలుపు!


