GNTR: వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు జిల్లాలో పలువురికి పార్టీ కీలక బాధ్యతలు అప్పగించారు. ఇందులో భాగంగా తెనాలి నియోజకవర్గానికి చెందిన పెసర్లంక వెంకటరమణను వైసీపీ జిల్లా రజక విభాగం అధ్యక్షుడిగా నియమించారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని ఆయన చెప్పుకొచ్చారు.
వార్తలు
వైసీపీ జిల్లా రజక విభాగం అధ్యక్షుడిగా రమణ


