హైదరాబాద్: 28°C
వార్తలు

'సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు భారతరత్న ఇవ్వాలి'

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా విపక్షాలు దేశవ్యాప్త నిరసనలకు సిద్ధమవుతున్న వేళ.. ఆయనకు మద్దతుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అగర్వాల్, వైశ్య సామాజిక వర్గాలకు చెందిన సంస్థలు బైఠాయించాయి. ఈ సందర్భంగా విపక్షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. అనంతరం జ్ఞానేశ్ కుమార్‌కు దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేశాయి.