సత్యసాయి: తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ముదిగుబ్బ మండల వీఆర్‌ఏలు చేపట్టిన సహాయ నిరాకరణ దీక్ష 13వ రోజుకు చేరింది. ప్లకార్డులు చేతబట్టి నిరసన తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సేవలు అందిస్తున్న తమకు వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్హతలను బట్టి ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం చర్చలకు పిలిచి, న్యాయం చేయాలని వేడుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
మాగోడు వినండి.. వీఆర్‌ఏలు


