హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రి లోకేష్‌ను కలిసిన జిల్లా క్రికెటర్

సత్యసాయి జిల్లాకు చెందిన భారత అంధుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, అర్జున అవార్డు గ్రహీత ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి ఉండవల్లిలో విద్యా, ఐటీ శాఖల మంత్రి లోకేష్‌ను కలిశారు. రాష్ట్రం తరఫున ఆడిన అంధ క్రికెటర్లకు ప్రోత్సాహకాలు అందించాలని, వారి కోసం క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. స్పందించిన మంత్రి లోకేష్.. అంధ క్రికెటర్లకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.