హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ అభ్యర్థులకు అన్నదాన సేవ ప్రారంభించిన కలెక్టర్

ADB: ఆదిలాబాద్ బీసీ స్టడీ సర్కిల్‌లో పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ పొందుతున్న 200 మంది అభ్యర్థుల కోసం ఇస్కాన్ ఆధ్వర్యంలో ఉచిత అన్నప్రసాద సేవను సోమవారం కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా అభ్యర్థులకు భోజనం వడ్డించి, వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు కలెక్టర్ సూచించారు.