హైదరాబాద్: 28°C
తెలంగాణ

సూర్యాపేటలో కాంగ్రెస్ మహా ధర్నా

SRPT: ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు, ఏకపక్ష నిర్ణయాలు జరిగాయని ఆరోపిస్తూ సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట మహా ధర్నా నిర్వహించారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించి, అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేల్  పాల్గొన్నారు.