హైదరాబాద్: 28°C
వార్తలు

ఆ ఆదేశాలను.. పాటిస్తారని భావిస్తున్నాం: సుప్రీం

టీఎంసీకి చెందిన 10 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలనే తమ ఆదేశాలను పశ్చిమ బెంగాల్ స్పీకర్ పూర్తిగా పాటిస్తారని తాము భావిస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. నిర్దేశించిన కాలపరిమితిలోగా ఆయన తగిన నిర్ణయం తీసుకుంటారని గట్టిగా నమ్ముతున్నామని తెలిపింది. ఈ కేసులో మూడు నెలల కాలపరిమితి అక్టోబర్ 8తో ముగుస్తుందని వెల్లడించింది.