BPT: సంతమాగులూరు మండల పరిధిలోని పత్తేపురం గ్రామ సచివాలయం వద్ద సోమవారం ప్రత్యేక 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' కార్యక్రమం నిర్వహించారు. క్షేత్రస్థాయిలోనే ప్రజల ఇబ్బందులను తీర్చడమే లక్ష్యంగా అధికారులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పత్తేపురం, పరిసర ప్రాంతాల ప్రజల నుంచి భూ రికార్డుల సరిదిద్దడం వంటి వాటిపై అర్జీలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
పత్తేపురంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక


