హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు ఆర్టీసీ ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమం

WNP: ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలు, సూచనలు, ఫిర్యాదుల స్వీకరణకు మంగళవారం మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రయాణికులు 9959226289 నంబర్‌కు ఫోన్ చేసి తమ సమస్యలను తెలియజేయాలని డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ కోరారు. ప్రయాణికుల నుంచి వచ్చే ఫిర్యాదులు, సూచనలను పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నారు.