హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పరీక్షల్లో మెరిసి ఉన్నత లక్ష్యాలు సాధించాలి: ఎంపీ

ATP: అనంతపురం నగరంలోని కెఎస్ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన 'యువత భవితకు భరోసా' కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. విద్యార్థినుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో వాటర్ ప్లాంట్, అదనపు తరగతి గదుల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మెరిసి ఉన్నత లక్ష్యాలు సాధించాలని సూచించారు.