హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆధునిక సర్వేయింగ్‌పై విద్యార్థులకు శిక్షణ

SRD: సుల్తాన్‌పూర్ JNTUH సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో బీటెక్ రెండో సంవత్సరం విద్యార్థులు హైదరాబాద్ ఉప్పల్‌లోని సర్వే ఆఫ్ ఇండియాను సందర్శించారు. ఆధునిక సర్వేయింగ్, మ్యాపింగ్, జీఐఎస్, రిమోట్ సెన్సింగ్, డ్రోన్ సర్వే తదితర సాంకేతికతపై విద్యార్థులు ప్రత్యక్ష అవగాహన పొందారు. ఈ సందర్శన విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆచరణాత్మకంగా తెలుసుకునే అవకాశం కల్పించింది.