హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముప్పవరంలో ఓటర్ల జాబితా పరిశీలన

BPT: ఎస్ఎస్ఆర్-2026లో భాగంగా జిల్లా రోల్ అబ్జర్వర్ ఎ. సుబ్రమణ్యం ముప్పవరంలో పర్యటించారు. గ్రామంలోని మూడు పోలింగ్ బూత్‌ల బీఎల్‌ఓలతో మాట్లాడి ఓటర్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొత్త ఓట్ల నమోదు, తొలగింపులు, ఫామ్-6, ఫామ్-8 దరఖాస్తుల ప్రక్రియను ఆయన నిశితంగా పరిశీలించారు. ఓటర్ల జాబితా సవరణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా బీఎల్‌ఓలు చూడాలన్నారు.